ఓం శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
వివాహ విషయంలో వధువు , వరుడు యొక్క జాతక పరిశీలన చేసే విధానం
వధూవరుల పొంతన అనేది వివహ విషయములో చాలా ముఖ్యమైనది , అతి ప్రధానమైనది. అనేక మంది అనేక రకాల వర్గములు గూర్చి విశ్లేషించి పొంతన చూస్తుంటారు . నక్షత్ర పరంగా వధూవర గుణ మేళన చక్రము ఆధారముగా 18 గుణములు వచ్చిన వివాహమునకు మంచిది అని పట్టికను చూసి చెబుతుంటారు, వింశతి వర్గములు మొత్తం 20 అవి వరుసగా 1) గ్రహమైత్రీ వర్గము 2) గణ వర్గము 3) స్త్రీ దీర్ఘ వర్గము 4) యోని వర్గము 5) నాడీ వర్గము

6) రాశివర్గము 7) మహేంద్ర వర్గము 8) గణిత గతాయుష్య వర్గము 9) ఆయు వర్గము 10) వశ్య వర్గము 11) దిన వర్గము 12) జాతి వర్గము 13) వేధ వర్గము 14) పక్షి వర్గము 15) రజ్జు వర్గము 16) యోని వర్గము 17) లింగ వర్గము 18) భూత వర్గము 19) చంద్ర యోగా వర్గము 20) గోత్ర వర్గము .
పై వాటిని చూసినప్పుడు పొంతన ఎంత వరకు వధు-వరుల జాతకములు కలసినవి అనేది కొంత వరకు మాత్రమే చెప్పగలం. సంపూర్ణముగా జాతక పొంతన తెలుసుకోవాలి అంటే వధూవరుల పుట్టిన తేదీ , నెల , సంవత్సరం తో పాటి పుట్టిన సమయం మరియు ప్రదేశం ఉన్నపుడు ముందుగా వధువు , వరుడు యొక్క జాతకాలు పరిశీలించాలి ఎవరి జాతకాలలో ఎవరికీ ఏ ఏ స్థానాలలో అనగా లగ్న చక్ర ద్వాదశ స్థానాలో అలాగే నవాంశ చక్రములోని ద్వాదశ స్థానాలలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి దృష్టి , వాటి దోషములు పరిశీలించాలి తదుపరి ఇరువురి జాతక చక్రంలో లగ్న , పంచమ , షష్టమ , సప్తమ , అష్టమ , దశమ భావాలు వాటిలో గల గ్రహాల పరిస్థితిని పరిశీలించాలి. లగ్న భావం ( జీవన విధానం , వృద్ధి ) , పంచమం ( సంతానం ) , షష్టమం ( ఆరోగ్యం ) , సప్తమ ( వివాహం , దాంపత్యం ) , అష్టమం ( ఆయుర్దాయం ) , దశమం ( కార్యదక్షత ) అలాగే చంద్ర స్థానం , దశా సంధి, రాహుకేతువుల యొక్క స్థానం.

ఇరువురి జాతకం లో ఇవి ప్రధానంగా కలవాలి ఇవి కలిసిన వధూవరులకు నిత్య సౌభాగ్యం , ధిర్ఘాయువు , సంతానం వృద్ధి కలుగును.
బ్రహ్మశ్రీ పెనుమత్స భద్ర
M.Sc.,M.Sc., M.Sc., ,MLISc.,M.Phil. PGDJV., D.Phrm.,SAS
Add comment